జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పై అవగాహన

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పై అవగాహన

SDPT: బెజ్జంకి మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌పై రైతులకు అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి సంతోష్ మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం తగ్గించి ఆవు పేడ, మూత్రంతో తయారైన జీవామృతం, బీజామృతం వాడాలని సూచించారు. ఈ సందర్భంగా వేప నూనె, ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు.