ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్
అనకాపల్లి కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 13 మంది ఉద్యోగులు వారి సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలను సమర్పించారు. ప్రతి ఒక్కరి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.