మండల పరిషత్ అభివృద్ధి అధికారికి గ్రామస్థుల వినతిపత్రం
HNK: ధర్మసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనిల్ కుమార్‌కు స్థానిక మోడల్ కాలనీ వాసులు వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రధాన రహదారి నుంచి మోడల్ కాలనీకి సిసి రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈసంపెళ్లి రమేష్, కొలిపాక లవన్ కుమార్ తదితరు పాల్గొన్నారు.