44 హైవేపై కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

44 హైవేపై కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ATP: గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలో 44 హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరిడి కొండకు చెందిన చంద్రమోహన్ రోడ్డు దాటుతుండగా కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రమోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.