ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్
KMM: మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద పంచాయతీ ఎన్నికల ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్స్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసినట్లు చెప్పారు. ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని పేర్కొన్నారు.