VIDEO: తుఫాన్ నష్టపరిహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కోనసీమ: అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా తీవ్ర నష్టపోయిన కుటుంబాలకు ఇవాళ ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసరాలు, నగదు సహాయం స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తుఫాన్ వల్ల కలిగిన ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి తగిన సహాయం అందిస్తుందని తెలిపారు.