'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

ప్రకాశం: మార్కాపురంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.