'పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి'
VZM: పౌర హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని బొండపల్లి తహసీల్దార్ డోల రాజేశ్వరరావు అన్నారు. పౌర హక్కుల దినం పురస్కరించుకుని వెదురువాడ పంచాయతీ కొవ్వాడపేటలో సదస్సు జరిగింది. పౌర హక్కులతో పాటు బాధ్యతలు విస్మరించరాదన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు పలు చట్టాలు ఉన్నాయని చెప్పారు. బాధ్యతలు విస్మరిస్తే హక్కులకు భంగం కలుగుతాయి అన్నారు.