కాలువలో పడి గీత కార్మికుడి మృతి
VKB: నవాబ్‌పేట్ మండల ఆర్కతల గ్రామానికి చెందిన గౌండ్ల రాంచంద్రయ్య (55) మంగళవారం రాత్రి పొలానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో బైక్‌తో పాటు పడి మృతిచెందాడు. ఇంట్లో నుంచి కల్లు తీసేందుకు వెళ్తుండగా గ్రామ పరిసర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై పుండ్లిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.