కనకమహాలక్ష్మి అమ్మవారి హుండీ లెక్కింపు
VSP: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 35 రోజుల అనంతరం బుధవారం హుండీలు లెక్కించారు. ఈ సందర్భంగా రూ.30,10,993 నగదు, 40.240 గ్రాముల బంగారం, 144.8 గ్రాముల వెండి ఆదాయం వచ్చిందన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఉపకమీషనర్ కె. శోభారాణి, దేవాదాయ శాఖ తనిఖీదార్ ఎం.శ్రీదర్, సహాయ కార్యనిర్వహణాధికారి కె.రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.