రోడ్డు నిర్మాణం చేపట్టడం మరిచారా సార్..!

MBNR: నవాబుపేట మండలం దిగలపల్లి గ్రామ శివారులోని నాకా ప్రాంతం నుంచి మేలాడుక తాండవరపు బీటీ రోడ్డు నిర్మించేందుకు గత ఏడాది జడ్చర్ల ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.