ఇరాన్‌ను గొప్పగా పునర్నిర్మించుకోండి: ట్రంప్
సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్‌లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, సైన్యం, పోలీసులు మాతో పోరాడాలనుకోవట్లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఇరాన్ ప్రజాస్వామ్యవాదులతో రివల్యూషనరీ గార్డ్స్, సైన్యం, పోలీసులు కలవాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి ఇరాన్‌ను గొప్పగా పునర్నిర్మించాలని కోరారు.