మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
AKP: నర్సీపట్నం మండలం వేములపూడి మోడల్ స్కూల్ ఆరో తరగతి ప్రవేశాలకు జరిగిన పరీక్ష ఫలితాలు విడుదల చేశామని ప్రిన్సిపల్ సంధ్య తెలిపారు. ఫలితాల జాబితాను పాఠశాల నోటీసు బోర్డులో అందరికీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. లేదా తల్లిదండ్రులు ఆన్‌లైన్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ఉంటుందన్నారు.