అధ్వానంగా అరుంధతి వాడ రహదారి

అధ్వానంగా అరుంధతి వాడ రహదారి

అన్నమయ్య:  చిట్వేలి అరుంధతి వాడలోని రహదారుల పరిస్థితి అద్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి రోడ్లు పూర్తిగా పాడై, బురదమయంగా మారాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పరిస్థితిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలు, వృద్ధులు ఈ దారిలో నడవాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.