YCP రాష్ట్ర కార్యదర్శిగా గొందేశి నియామకం
E.G: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా గొందేశి శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన రాజమండ్రి ఐదుబల్ల మార్కెట్ ప్రముఖ సీనియర్ న్యాయవాదిగా, కొవ్వూరు నియోజకవర్గం పరిశీలకులుగా, వైసీపీ సీనియర్ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఈయన నియామకంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.