భారత బలగాలకు దేశం అండగా నిలుస్తుంది: మంత్రి

E.G: ఆపరేషన్ సిందూర్ కోసం భారత బలగాలు తీసుకున్న నిర్ణయం పట్ల యావత్తు దేశం అండగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ విషయమై ప్రస్తావిస్తూ 'ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోవడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం' అని పేర్కొన్నారు.