VIDEO: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే వేగుళ్ల
కోనసీమ: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం మండపేట నుంచి ద్వారపూడి వెళ్తున్న ఆటో, బైక్‌ను ఢీ కొట్టి ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురుకి, బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే స్పందించి తన కారులో క్షతగాత్రులను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్య సహాయం అందేలా చేశారు.