'నిజాం నగలు.. RBI వద్ద సేఫ్'

'నిజాం నగలు.. RBI వద్ద సేఫ్'

HYD: హైదరాబాద్ నిజాం పాలకులకు చెందిన అపురూపమైన ఆభరణాలు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 173 రకాల చారిత్రక నగలను 1995 నుంచి RBI వాల్ట్స్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య భద్రపరిచినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో స్పష్టం చేశారు.