మెట్రో రైలులో ప్రయాణించిన మంత్రి
TG: మంత్రి జూపల్లి కృష్ణారావు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులతో సరదాగా మాట్లాడారు. ఆయన ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లారు. ప్రోటోకాల్స్‌కు భిన్నంగా ఆయన అత్యంత సాదాసీదాగా మెట్రో ఎక్కారు. మెట్రో స్టేషన్‌కు చేరుకున్న మంత్రి స్వయంగా టికెట్ తీసుకున్నారు. మెట్రోలో సీటు లేకపోవడంతో తోటి ప్రయాణికులతో నిలబడే ప్రయాణించారు.