తవణంపల్లిలో రేపు ఎమ్మెల్యే ప్రజాదర్బార్
CTR: తవణంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే 'ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని తవణంపల్లి ఎంపీడీవో విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.