ముగిసిన జోగి రమేశ్ సోదరుల విచారణ
కృష్ణా: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ సోదరుల నాలుగో రోజు విచారణ ముగిసింది. కల్తీ మద్యం కేసులో జోగి సోదరులు ఐదు రోజుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి రమేశ్, ఆయన సోదరుడు రాములను లోతుగా విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.