కేంద్రమంత్రితో మంత్రి నారాయణ భేటీ
AP: మంత్రి నారాయణ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ కానున్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించి కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన నిధుల కేటాయింపు, విడుదలపై చర్చించనున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు.