సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విద్యార్థులు
SRD: రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ‘సాధన-2025’ పేరిట విద్యార్థుల కళాత్మక ప్రతిభా ప్రదర్శనను మంగళవారం నిర్వహించారు. మైనర్ ప్రోగ్రామ్, ఓపెన్ ఎలక్టివ్ (ఓఈ) కోర్సులను అభ్యసించే విద్యార్థులు ఈ కార్యక్రమంలో కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడిలో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఇచ్చారు.