నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన
KMM: సింగరేణి మండలంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ బుధవారం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తలారి చంద్రప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మండలంలోని మాదారం గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.