'మంత్రికి రైతులు కష్టాలు కనిపించడం లేదా?'

W.G: ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన మంత్రి నాదెండ్లకు ఇక్కడ రైతులు కష్టాలు కనిపించడం లేదా.. అని మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. శనివారం కాళ్ల మండలం పెదఅమీరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతు వద్ద ఉన్న ప్రతి గింజ ప్రభుత్వం కొనాలన్నారు.