రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌కు స్వర్ణం
MNCL: మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి SGF అండర్-14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలురు సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్‌లో నిజామాబాద్ జిల్లా జట్టును ఓడించి, ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు గోల్డ్ మెడల్ సాధించినట్లు SGF సెక్రెటరీలు వెంకటేష్, యాకుబ్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన క్రీడకారులతో పాటు జట్టు కోచ్‌లను పలువురు అభినందించారు.