కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్కెట్ చైర్మన్

WGL: వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, PACS చైర్మన్ కన్నయ్యలు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.