ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే
NTR: వీరులపాడు మండలంలోని వెల్లంకి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సౌమ్య ప్రజల నుంచి వినతులను స్వయంగా స్వీకరించారు. ప్రజలు ఆమె దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.