హోళీ ఐక్యతకు ప్రతీక: శ్రీకాంత్ రెడ్డి
కడపలో సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న హోళీ సంబరాల పోస్టర్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం యర్రమరెడ్డిగారిపల్లెలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హోళీ పండుగ ఐక్యత, కరుణకు నిదర్శనమని, ప్రతి ఇంటిలో శాంతి-సంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు.