అతను పేపర్ కెప్టెన్ మాత్రమే: మాజీ క్రికెటర్
CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ జట్టులో ఉన్నంతకాలం రుతురాజ్ పేపర్ కెప్టెన్ మాత్రమేనని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా లేకపోయినా జట్టుపై పూర్తి ఆధిపత్యం ధోనీకే ఉంటుందని చెప్పాడు. ధోనీ పాత్ర ఇంపాక్ట్ ప్లేయర్ కంటే ఎక్కువని.. అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయడని వెల్లడించాడు.