నేడు మెగా జాబ్ మేళా
విజయనగరం: భోగాపురం మండలం ముంజేరులోని మిరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్‌లో శనివారం మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో సుమారు 37 కంపెనీలు పాల్గొని 2000 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాయని అధికారులు తెలిపారు. కావున ఆసక్తిగల అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.