కులం పేరుతో దాడి.. 13 మందికి జైలు శిక్ష

కులం పేరుతో దాడి.. 13 మందికి జైలు శిక్ష

KMR: సదాశివనగర్ మండలం అమర్లబండలో కులం పేరుతో దూషించి దాడి చేసిన కేసులో 13 మందికి NZB కోర్టు శిక్ష విధించింది. రాజేశ్వర్‌పై రతన్‌కుమార్‌తో పాటు 12 మంది దాడి చేసిన ఘటనపై విచారణ జరిపి, కోర్టు రతన్‌కుమార్‌కు 3 ఏళ్ల జైలు, రూ. 7,200 జరిమానా, మిగతా 12 మందికి ఏడాది జైలు, రూ. 4,200 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.