రైలు కిందపడి యువకుడు మృతి
కడప మండలం భాకరాపేట సమీపంలో మంగళవారం రాత్రి గూడ్స్ రైలు కిందపడి సుమారు 30 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని చేతిపై N, మంజు అనే పేర్లతో టాటూలు ఉన్నాయని రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడు టీషర్ట్ ధరించి ఉన్నాడని, అతని వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.