పార్టీ ప్రతిష్టను నిలబెట్టాలి: ఎంపీ

ELR: పార్టీ నాయకులంతా ఐకమత్యంగా ఉంటూ, పార్టీ ప్రతిష్టను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కోరారు. జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న గన్ని వీరాంజనేయులు అందరినీ సమన్వయంతో నడిపించారన్నారు.