VIDEO: మరికొద్ది సేపట్లో రంగనాయకుడి కళ్యాణం
ప్రకాశం: రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రంగనాయకుడి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. పలువురు ప్రముఖులు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కళ్యాణానికి తరలి వస్తున్నారు. దాదాపు 20,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.