హైపర్‌సోనిక్ క్షిపణి సక్సెస్‌

హైపర్‌సోనిక్ క్షిపణి సక్సెస్‌

అత్యంత ప్రమాదకరమైన హైపర్ సోనిక్ కింజాల్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. నేలపైనే కాకుండా ఆకాశంలో, సముద్రంలో కూడా ఎటువంటి సవాలునైనా ఇది ఎదుర్కోగలదని మాస్కో తెలిపింది. ఈ క్షిపణి ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ వేగంగా ప్రయాణించగలదు. ఏ వైమానిక రక్షణ వ్యవస్థ కూడా దీనిని చేధించలేదని అధికారులు పేర్కొన్నారు. అమెరికా సుంకాల వేళ రష్యా ఈ ప్రయోగం చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది.