ఉధృతంగా తుంగభద్ర.. ప్రమాద హెచ్చరిక జారీ

KRNL: మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠం వద్ద తుంగభద్రనది ఉధృతంగా ప్రవహిస్తోంది. గంగమ్మ గుడి, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. నదిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు భక్తుల పుణ్య స్నానాలు నిలిపివేసి షవర్ల ద్వారా స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసి సీఐ తెలిపారు.