'ఉపాధి కల్పించకపోతే పోరాటం తప్పదు'
AKP: పరవాడ ఫార్మా కంపెనీలలో స్థానికులకు ఉపాధి కల్పించకపోతే పోరాటానికి దిగాల్సి ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరించారు. మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గురువారం కలపాకలో పంచకర్ల పర్యటించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని యాజమాన్యాలను అడిగితే బెదిరిస్తున్నారని ఎమ్మెల్యేకు స్థానికులు తెలిపారు.