VIDEO: కర్నూలు బస్సు దుర్ఘటన.. మృత్యుంజయుడిగా ఖమ్మం వాసి
KMM: కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు సజీవ దహనం కాగా, సత్తుపల్లి పట్టణానికి చెందిన మన్నేపల్లి సత్యనారాయణ మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. హైదరాబాద్‌లోని DRDOలో పనిచేస్తున్న సత్యనారాయణ, ఆఫీస్ పని నిమిత్తం బెంగళూరుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కాగా, సత్యనారాయణ కాలికి స్వల్ప గాయాలు అయినప్పటికీ, క్షేమంగా ఉన్నట్లు ఆయన తండ్రి రవి తెలిపారు.