నేడు జిల్లాకు మంత్రి లక్ష్మణ్ కుమార్ రాక

HNK: నేడు జిల్లాకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రానున్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో జనహిత పాదయాత్రపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి స్థానిక కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 25వ తేదీన వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర జరగనుంది.