'FFT, FST బృందాల పాత్ర కీలకం'
JN: జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో FFT, FST బృందాల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కిరణ్, కలెక్టర్ రిజ్వాన్ భాషా అన్నారు. పోలింగ్ సమయంలో నగదు, మద్యం వంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు తనిఖీలు చేపట్టాలని FFT, FST బృందాలకు సూచించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎన్నికల అధికారులు నిరంతర పర్యవేక్షణతో ఉండాలన్నారు.