'నిర్దేశిత గడువులోగా నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలి'
SKLM: నిర్దేశిత గడువులోగా నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలి అని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం సాయంత్రం అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘జలధార - జలహారతి’ పనులను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోని కాలువలు, చెరువులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.