లారీ డ్రైవర్లు, క్లీనర్లకు వేతనాలు పెంచాలి: AITUC
ASF: లారీ డ్రైవర్లు, క్లీనర్లకు వేతనాలు పెంచాలని లేని పక్షంలో సమ్మె చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం టీటీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసును అందజేసినట్టు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. లారీ డ్రైవర్లకు క్లీనర్లకు చాలీచాలని వేతనాలు అందడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.