'పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా?'

'పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా?'

TG: భూమిని కాపాడుకోవడానికే అరికపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారని MLA మాధవరం కృష్ణారావు విమర్శించారు. హైడ్రా ఆక్రమణలు కూల్చివేసిన 2 రోజుల్లోనే అరికపూడి 11 ఎకరాల చుట్టూ రేకులు వేశారని తెలిపారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? అని నిలదీశారు. 11 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.