'ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: MP'

'ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: MP'

ప్రకాశం: దిత్వా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా అధికారులు, వాతావరణ శాఖ వారి హెచ్చరికలను ప్రతి ఒక్కరూ పాటించాలని, తుఫాన్ ముప్పు తగ్గినట్లు అధికారులు ప్రకటించేంతవరకు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు. అవసరం ఉంటేనే ప్రజలు బయటికి రావాలని ఆయన సూచించారు.