మధిరలో నేటి నుంచి సర్పంచ్ నామినేషన్లు
KMM: సర్పంచ్ అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతా తెరవడం తప్పనిసరి అని తహశీల్దార్ రాళ్లబండి రాంబాబు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. మధిర మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. మండలంలోని 8 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.