వే బిల్లులు లేకుండా ఇసుక రవాణా

BDK: వే బిల్లులు లేకుండా అధిక లోడులతో వెళ్తున్న ఇసుక లారీలపై చర్యలు తీసుకోవాలని భద్రాచలం ప్రజలు కోరుతున్నారు. చర్లలో ఇసుక లోడు చేసుకుని వే బిల్లులు మాత్రం పాల్వంచలో వేస్తున్నారని చెబుతున్నారు. చెక్ పోస్టు వద్ద చెకింగ్ లేకుండానే ఇసుక లారీలు యథేచ్చగా ప్రయాణం కొనసాగిస్తున్నాయన్నారు. మైనింగ్, సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని కోరుతున్నారు.