'రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు'
MDK: శివంపేట మండలంలో రహదారులపై ధాన్యం ఆరబోసి వాహనదారులకు ప్రమాదాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మధుకర్ రెడ్డి హెచ్చరించారు. రోడ్లపై ధాన్యం వేయడంతో బైక్లు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు లేదా కల్లాల్లో మాత్రమే ఆరబోసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామన్నారు.