బుసిరెడ్డిపల్లిలో పంచాయతీ భవనం ప్రారంభం
WNP: పానగల్ మండలం బుసిరెడ్డిపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని తెలిపారు. గ్రామ ప్రగతికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.