పోలీస్ స్టేషన్ నూతన భవనానికి భూమిపూజ

పోలీస్ స్టేషన్ నూతన భవనానికి భూమిపూజ

SRCL: రుద్రంగి మండలంలో రేపు నూతన పోలీస్ స్టేషన్ భవనానికి భూమి పూజ జరగనుంది. దీంతో రేపు జరగబోయే భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను గురువారం అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మోతిరామ్ పరిశీలించారు. విద్యుత్ మరమ్మతు పనులను, అలాగే భూమి చదును చేసే ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. సర్పంచ్ గండి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.